మొత్తం రెండు భాగాలుగా పాన్ ఇండియా సినిమాగా ఏకంగా ఐదు భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీటిలో పుష్ప పార్ట్ 1 దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా దీనిని ఈ నెల 17న భారీ ఎత్తున విడుదల చేయనుంది యూనిట్. సుకుమార్ ఎంతో భారీ స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్,అలానే సాంగ్స్ అన్నిటికీ ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది.
మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఫస్ట్ పార్ట్ 1 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 6న విడుదల కానుండగా ట్రయిలర్ లోని కొన్ని కీలక సీన్స్ ని తీసుకుని దానిని టీజ్ పేరుతో నేడు సాయంత్రం 6 గం. 3 ని. లకు రిలీజ్ చేయనుంది పుష్ప చిత్ర యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఇక ఇటీవల వరుసగా పుష్ప నుండి అప్ డేట్స్ వస్తుండడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి మరొక పదిహేనురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.