హీరోయిన్ కంగనా రనౌత్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. కానీ ఈమె వీటితోపాటుగా ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా సంపాదించుకుంది. ఎప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూ.. తన సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈమె ఏ వంశానికి చెందిన వారసురాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


కంగనా రనౌత్ రాజవంశ కుటుంబానికి చెందినది. ముఖ్యంగా ఈమె ఇండస్ట్రీ వైపు రాకుంటే ఒక బడా ఫ్యామిలీ లో ఉండేది. కానీ ఈమె తమ ఇంట్లో వాళ్లతోనే గొడవ పెట్టుకొని ఇంటి నుండి బయటికి వచ్చి ఎన్నో ఇబ్బందులను పడుతోంది. అయితే ఈమె యొక్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
రంగనాథ్ హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి రాజపుత్ర రణవత్ అనే వంశం లో జన్మించింది. ఈమె ముత్తాత కూడా 1951 లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కంగనా రనౌత్ తాత కూడా ఒక ఐఏఎస్ అధికారి. ఈమె తండ్రి మాత్రం ఒక వ్యాపారస్తుడు. ఈమె కుటుంబం చాలా పెద్దది.. కానీ ఈమెకు తన కుటుంబంతో కలిసి ఉండడం ఇష్టం లేకపోవడం వల్లే సినిమాల వైపు అడుగులు వేసింది. తనకు నచ్చిన మాటలు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది కంగనారనౌత్.

అలా ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు.. తన తండ్రి బయటికి వెళ్లి పోతే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని తెలియజేశారట. కానీ మీ డబ్బులు నాకు అవసరం లేదని చెప్పి బయటకు వచ్చేసింది ఈమె. కంగనా రనౌత్ డబ్బు కోసం మోడలింగ్ రంగం వైపు కూడా అడుగు వేసింది.. ఆ తరువాత మహేష్ భట్ పరిచయం అవడంతో సినీ అవకాశాలు కోసం తనని అడగగా తను నిర్మిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అనుకో గా.. కానీ ఆమె వయస్సు అప్పటికీ 17 సంవత్సరాలు మాత్రమే. కానీ అందరూ ఎలా చేస్తుందో అని అనుకుంటూ ఉండగా ఎట్టకేలకు తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె విజయం సాధించింది. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె హీరోయిన్ గా ఎదుగుతున్న దని వారి కుటుంబ సభ్యులకు తెలియగా ..తన ఇంటి పేరును వాడుకోవద్దని హెచ్చరించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: