టాలీవుడ్ లో అపజయం లేని దర్శకుడిగా
కొరటాల శివ తనకే సొంతమైన విజయాలతో సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తొలి చిత్రం నుంచి భారీ నేపథ్యం ఉన్న సినిమాలు చేయగా పెద్ద హీరోలతో మాత్రమే కుదిరే సినిమాలను ప్రయోగాలను చేసి హీరోలకు మంచి
సక్సెస్ ను తెచ్చి పెట్టాడు. అందుకే హీరోలు
కొరటాల శివ తో మళ్లీ మళ్లీ మరొక సారి కూడా
సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు శ్రీమంతుడు మరియు
భరత్ అను నేను అనే రెండు సినిమాలతో త్వరలో రాబోతుండగా అవి ఎంతటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
అలాగే
ఎన్టీఆర్ తో ఇప్పటికే జనతా గ్యారేజ్
సినిమా చేసిన
కొరటాల శివ ఇప్పుడు మరో సినిమాను కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ మిర్చి
సినిమా చేశాక ఆయనతో ఓ
సినిమా చేయాలని ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు
కొరటాల శివ. అలా చేసిన హీరోలతో మళ్లీ చేస్తూ వారి పట్ల ఆయన మంచి నమ్మకాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అచార్య చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా కరోనా కారణంగా వాయిదా పడగా మంచి ముహూర్తం కోసం ఎదురు చూడగా ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల చేస్తుండటం విశేషం. అయితే అక్కడ
సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో
కొరటాల శివ లో కూడా ఓ టెన్షన్ మొదలైందట. అదేమిటంటే అఖండలాగే ఆచార్య కూడా భారీ హోప్స్ ఉన్న సినిమా. అక్కడ
బాలకృష్ణ హీరో అయితే ఇక్కడ
చిరంజీవి హీరో. మరి ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ భారీగా ఉండడంతో అంతటి స్థాయిలో తాను కూడా చిరంజీవికి విజయాన్ని అందించాలనే టెన్షన్ ఇప్పుడు
కొరటాల లో కూడా ఉందని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల విజయాలతో వచ్చిన
కొరటాల శివ ఈ
సినిమా విషయంలో కూడా అదే స్థాయి లో హిట్ అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.