
కానీ ఉప్పెన సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో పాటు సమానంగా క్రెడిట్ ను పొందింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ ఉప్పెన బ్యూటీ పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హీరోయిన్ అంటే సినిమాకి గ్లామర్ మాత్రమే కాదని కథకు కీలకం కాగల సత్తా హీరోయిన్స్ కు ఉందని ఉరకలు వేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ ఈ సినిమాలో ఉప్పెన సినిమాకి మించిన క్రేజ్ ను తెచ్చుకుంటుంది అంతా ఆశిస్తున్నారు.
ఈ సినిమా 'సోగ్గాడే చిన్న నాయనా' కు కొనసాగింపుగా ఇది వస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్, టీజర్ మరియు పాట సినిమాపై మరింత క్రేజ్ ను పెంచాయి. వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తునారు.