మెగా కోడలు ఉపాసన గత కొన్ని రోజులుగా చాలా సంతోషంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు కారణం ఉపాసన ఇంట్లో తన చెల్లెలు అనుష్పాలా పెళ్లి కార్యక్రమాలు చేపట్టడమే.. ఉపాసన ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతే కాదు ఉపాసన చెల్లి పెళ్లికి కావలసిన అన్ని పనులను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోవడం గమనార్హం.. అయితే వీరి ఇంట్లో జరుగుతున్న పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం కూడా గత వారం రోజుల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు..


తన చెల్లెలు పెళ్లి అయిపోయింది అంటూ ఎమోషనల్ అయింది ఉపాసన.. ఇక తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ చెల్లి పెళ్లిని చూసి  అక్క ఉపాసన తెగ మురిసిపోయింది. గత కొన్ని రోజులకు ముందే అంటే అనుష్పాలా.. అర్మాన్  తో ఎంగేజ్ మెంట్ జరిగినా అప్పట్నుంచి తన సోదరి మీద ఈమె ఎక్కువగా ప్రేమను కురిపిస్తూనే వచ్చింది. ఇకపోతే చెన్నై కి వెళ్లి అనుష్పాలా  సెటిల్ అవడంతో నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఆమె తన చెల్లెల్ని తలుచుకుంటూ పోస్ట్ కూడా పెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలి వివాహం లో ఉపాసన అంతా తానే అయ్యి ముందుండి నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఇకపోతే డిసెంబర్ 8వ తేదీన అనుష్పాలా , అర్మాన్  ల పెళ్లి అయిపోయింది. మూడు ముళ్ల  బంధంతో జంట గా మారారు. పెళ్లి ముగియడంతో ఉపాసన తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ సోదర పెళ్లి అవడంతో చాలా సంతోషంగా ఉందని , తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని ఆమె బాగా మురిసిపోయింది. అంతేకాదు వారి ఇద్దరి జంట ఫోటోలు షేర్ చేస్తూ.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఒక ఏమోజీ ని షేర్ చేసింది ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి: