వాస్తవానికి ఈ సినిమా విడుదల చాలా రోజుల క్రితమే అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల కాలేకపోయింది. ఆ విధంగా అఖండ సినిమా బాలయ్య లో మాత్రమే కాదు సినిమా పరిశ్రమలో అభిమానుల్లో ప్రేక్షకుల్లో కూడా మంచి కాన్ఫిడెన్స్ నింపింది అని చెప్పవచ్చు. అందరూ బాలకృష్ణ సాధించిన సక్సెస్ పట్ల ఎంతో ఆనందం గా ఉండగా ఇప్పుడు ఆయనకు వరుసగా పెద్ద దర్శకులు ఆయనతో సినిమా చేసే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు.
క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకొని దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ను కూడా సరికొత్త గా చూపించబోతున్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. సరికేరు నీకెవ్వరు సినిమాతో తను స్టార్ హీరోలను బాగానే హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకున్న అనిల్ బాలయ్య తో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో చూడాలి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కొరటాల శివ కూడా బాలకృష్ణ తో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట. పూరి జగన్నాథ్ కూడా బాలకృష్ణ తో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇంకా ఓ తో డైరెక్టర్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.