ఒక సినిమాలో వందమంది స్టార్స్‌తో అయినా వర్క్ చేయొచ్చు గానీ ఇద్దరు హీరోయిన్లని మేనేజ్ చేయడం చాలా కష్టమని అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి కూడా ఇలాంటి సిట్యువేషన్‌లోనే పడిపోయాడు. పైకి పాజిటివ్‌గా కనిపిస్తున్నా.. వాళ్ల అభిమానులను సంతృప్తి పరచలేక చాలా కష్టపడుతున్నాడు జక్కన్న.
నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తున్నారు అనగానే 'ఆర్ ఆర్ ఆర్'పై అంచనాలు పెరిగాయి. ఇక రాజమౌళి మార్క్‌తో ఈ అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. అలాగే అభిమానులు కూడా వాళ్ల అభిమాన హీరోని జక్కన్న ఎలా చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో ఎవరు హైలెట్ అవుతారో అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.
రాజమౌళి సినిమాల్లో ఎమోషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఇద్దరు హీరోల అభిమానులని కూడా అలాగే హ్యాండిల్ చేస్తున్నారు. స్టిల్స్ నుంచి మొదలుపెడితే టీజర్స్ వరకు అన్నింటా ఇద్దరు వినిపించేలా, కనిపించేలా జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ టీజర్‌కి జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే, తారక్ టీజర్‌కి చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
మరోవైపు ట్రైలర్ రిలీజ్‌కి ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కూడా అభిమానులు హర్ట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి. ఉదయం జూ.ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేసిన జక్కన్న సాయంత్రానికి రామ్ చరణ్ పోస్టర్ దించేశాడు. మరి ప్రమోషన్స్‌లో ఇద్దరినీ ఈక్వల్‌గా చూపిస్తోన్న జక్కన్న సినిమాలో ఇద్దరి స్టార్డమ్‌ని ఈక్వల్‌గా చూపించడానికి ఎలాంటి మేజిక్స్ ప్లే చేశాడనేది ఇండస్ట్రీ జనాల్లో ఆసక్తి పెంచుతోంది.