రవితేజ హీరోగా వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అనౌన్స్ మెంట్లు చేస్తున్నాడు కానీ ఆయన నటించిన సినిమాలు మాత్రం విడుదల చేయలేక పోతున్నాడు. క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఆ తర్వాత కొద్ది గ్యాప్ లోనే సినిమాను విడుదల చేస్తాను అన్న రవితేజ ఇప్పుడు ఇన్ని నెలలు అవుతున్న రిలీజ్ చేయకపోవడం కొంత నిరాశగా ఉంది. ఎందుకంటే ఆయన హీరోగా నటించిన కిలాడి చిత్రం ఇప్పుడు విడుదల కాకపోవడం వారిని ఎంతగానో కలవరపెడుతుంది. మాస్ రాజా ను వెండితెరపై చూసి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఆయనను వెండితెరపై మరొకసారి చూసి తరించి పోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

తొందర్లోనే తన మంచి సినిమా తో వస్తానని అప్పట్లో రవితేజ చెప్పాడు అయితే ఇప్పటికి కూడా ఆయన నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం కొంత నిరాశ పరుస్తుంది. ఆయన హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కిలాడి చిత్రం ఆ మధ్య ఆర్థిక సమస్యల లో కొట్టుమిట్టాడుతోందని రవితేజ దగ్గరుండి సెట్ చేసి సినిమాను షూటింగ్ కి తీసుకెళ్లారు అని వార్తలు వచ్చాయి. చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కాగా ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమాని విడుదల చేయడమే అని అనుకున్నారు. ఇవి బయటకు చెప్పి చాలా రోజులే అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి విడుదల తేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
 
ఫిబ్రవరిలో విడుదల చేస్తామని అప్పట్లో వార్తలు వచ్చినా కూడా అధికారికంగా ప్రకటించక పోవడం సినిమా విడుదల పట్ల అనుమానాలను కలగజేస్తుంది. మరి ఇప్పటికైనా సినిమా నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల అప్డేట్ ను ఇవ్వకపోతే సినిమాపై క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇక రవితేజ విషయానికి వస్తే ఈ సినిమాను పూర్తి చేసి తన తదుపరి సినిమాలో చిత్రీకరణలో కి వెళ్ళిపోయాడు. ఏకంగా నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి అంటే ఆయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో తెలియజేస్తున్నాడు. వరుస సినిమాలతో పాటు మంచి విజయాలతో ఉన్న రవితేజ ఈ సారి ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు ఇంతటి స్థాయి ఉన్న హీరోగా ఎదిగాడు అంటే నిజంగా రవితేజ సినిమా పట్ల తన ఫ్యాషన్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: