ఒరిజినల్ స్టోరీలో సోల్‌ని కంటిన్యూ చెయ్యలేకపోతే రీమేక్ సినిమాలు ఫ్లాప్ అయ్యే ప్రమాదముంది. అందుకే చాలామంది నిర్మాతలు సౌత్ సినిమాలని రీమేక్ చెయ్యాలనుకున్నప్పుడు సౌత్ డైరెక్టర్స్ దగ్గరకే వస్తున్నారు. ఒరిజినల్ సోల్‌ని మిస్ కాకుండా చూసే బాధ్యతలని వాళ్లకే అప్పగిస్తున్నారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తమిళ హిట్ 'విక్రమ్ వేద' రీమేక్‌లో నటిస్తున్నాడు. తమిళ్‌లో విజయ్ సేతుపతి, మాధవన్ ప్లే చేసిన క్యారెక్టర్స్‌ని హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ రీప్లేస్ చేశారు. ఇక ఒరిజినల్ మూవీ తీసిన పుష్కర్, గాయత్రి దర్శకత్వంలోనే హిందీ 'విక్రమ్ వేద' కూడా తెరకెక్కుతోంది.
డైనమిక్ యాక్టింగ్‌తో నేషనల్ అవార్డ్ అందుకున్న రాజ్‌కుమార్ రావు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ 'హిట్'ని రీమేక్ చేస్తున్నాడు. భూషణ్ కుమార్‌తో కలిసి దిల్ రాజు ఈ రీమేక్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తెలుగులో హిట్ సినిమాని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ రీమేక్ కూడా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ కూడా సౌత్ రీమేక్స్ కోసం సౌత్ డైరెక్టర్స్‌నే తీసుకెళ్లాడు. 'కాంచన' రీమేక్‌ని లారెన్స్ డైరెక్షన్‌లోనే చేశాడు. ఈ మూవీ హిందీలో 'లక్ష్మీ'గా రీమేక్ అయ్యింది. అలాగే 'ఠాగూర్' సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో రీమేక్ చేశాడు. ఈ మూవీ హిందీలో 'గబ్బర్ ఈజ్ బ్యాక్'గా రీమేక్ అయ్యింది.