బిగ్బాస్ కార్యక్రమము ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులందరిలో కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అన్న టెన్షన్ మొదలైంది.. తమ అభిమాన కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ గా గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దీంతో ఇక అభిమాన కంటెస్టెంట్ లకు ప్రతి రోజూ తప్పకుండా ఓట్లు వేస్తూ  మద్దతు పలుకుతున్నారు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ కావడంతో.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సిరి మానస్, శ్రీ రామచంద్ర, సన్నీ,  షణ్ముఖ్ జస్వంత్ లు టాప్ ఫైవ్ లో కి చేరుకున్నారు.


 ఇక టాప్ ఫైవ్ లో నిలిచిన కంటెస్టెంట్ లలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలబడపోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బిగ్బాస్ నిర్వాహకులు ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇలాంటికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను కూడా ఆకర్షించారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్ లను  ప్రశ్నలు అడిగేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు  హౌస్ లో ఉన్న వారిని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో వారాల పాటు సేవ్ అవుతూ వచ్చి ఇటీవలే ఎలిమినేట్ అయింది పింకీ. హౌస్ లో ఉన్నన్ని రోజులు మానస్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంది అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయం మొత్తం కేవలం మానస్ తో మాత్రమే గడిపింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మానస్ తన గురించి ఏమనుకుంటాడో అన్న ఒక వీడియో చూసి షాక్ అయింది. ఇక ఇటీవలే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను ప్రశ్నలు అడిగేందుకు అవకాశం రాగా పింకీ మానస్ ముఖం మీద ఒక ప్రశ్న అడిగేసింది. మానస్ బిగ్ బాస్ హౌస్ లో నాతో ఇష్టంగా ఉన్నావా లేకపోతే నన్ను కేవలం భరించావా అంటూ  పింకీ అడగడంతో మానస్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: