ఇకపోతే ఇక బిగ్ బాస్ ఫైనల్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది దీంతో బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు గెలవ బోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఇటీవల కాజల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్ లు బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమంలో హౌస్‌లో ఎదురైన అనుభవాలను పంచు కుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి మళ్లీ బయటికి వచ్చిన కాజల్ కూడా బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొంది.
ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి.. అన్న విషయాన్ని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సన్నీ మానస్ తనకు మంచి స్నేహితులుగా మారిపోయారు అంటూ కాజల్ తెలిపింది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సన్ని, మానస్ లలో ఎవరు టైటిల్ విన్నర్‌గా నిలవాలని మీరు కోరుకొంటున్నారు అంటూ అని ప్రశ్నించగా.. సన్నీ టైటిల్ విన్నర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతనికి కప్పు గెలవాలనే కసి ఎక్కువగా ఉంది అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.