టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ జంట గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నాం  అంటూ ప్రకటించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అభిమానులకి . ఆ తరువాత వీళ్లిద్దరి పై ఎన్నో రకాల రూమర్లు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత ..అక్కినేని ఇంటి కోడలిగా సెట్ కాదని, ఆమెకు వేరే వాళ్లతో ఎఫైర్ ఉందని కొందరు.. నెట్టింట తెగ ప్రచారం చేసారు. కానీ నాగ చైతన్య తో పోల్చుకుంటే సమంత కొంచెం ఎక్కువే నెగిటివిటీని మూటకట్టుకుంది విడాకుల ద్వారా అని తెలుస్తుంది.

ఇక వీళ్లు విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ లో హాట్ గా కనిపించడమే అంటూ వార్తలు వినిపించాయి. ఆ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే పాత్రలో కొంచెం బోల్డ్ గానే నటించింది. అక్కినేని ఇంటి కోడల్లు అలాంటి హాట్ లుక్స్ లో కనిపించడంతో అప్పట్లో దాని పై పెద్ద దుమారమే రేగింది. ఇక సీన్ కట్ చేస్తే ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన కొన్నాళ్ల తరువాత సమంత నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. 

కాగా, రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన "పుష్ప" అనే సినిమాలో అల్లు అర్జున్ పక్కన  సమంత ఓ ఐటెం సాంగ్ చేసి అభిమానులకు సడెన్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో సమంత హాట్ లుక్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. పెళ్లి తరువాత సమంత బయట ఎప్పుడు ఇలాంటి హాట్ డ్రెస్సులతో  కనిపించలేదు. కానీ విడాకుల తరువాత ఇలా రూట్ మార్చే సరికి ..నాగచైతన్య పై రీవేంజ్ తీర్చుకోవడానికే ఇలాంటి సాంగ్స్ కు ఓకే చెబుతుంది అంటున్నారు నెటిజన్స్. మరి నిజంగా సమంత చై పై కోపంతోనే ఇలా చేసిందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: