మీడియా జర్నలిస్ట్ లు కూడా పర్సనల్ గా కాని.. వీడియో రూపం లో కానీ తమ ఫీడ్ బ్యాక్ అందించాలని కోరారు అల్లు అర్జున్. పుష్ప నచ్చితే ఎందుకు నచ్చింది.. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కూడా చెప్పండి అని అన్నాడు అల్లు అర్జున్. సినిమాలో ఏ అంశాలు బాగా నచ్చాయి. పాయింట్ టు పాయింట్ తనకు మీడియా పర్సన్స్ తెలియచేయాలని కోరారు. బన్నీ ఏ సినిమాకు కూడా ఇలా మీడియాని అడగలేదు. పుష్ప సినిమాపై తన స్పెషల్ ఇంట్రెస్ట్ అలా అడిగేలా చేసిందని అంటున్నారు.
అంతేకాదు మీరు చెప్పే పాయింట్లు కరెక్ట్ గా జెన్యూన్ గా ఉండాలని అంటున్నారు బన్నీ. సినిమా రిలీజైతే ఎలాగు మీడియా వాళ్లు రివ్యూస్ ఇవ్వడం కామన్. కాని బన్నీ మాత్రం కొత్తగా మీడియా పర్సన్స్ ని పర్సనల్ గా తనకు సినిమా గురించి షేర్ చేయండి అనడంలో పుష్ప సినిమాపై ఐకాన్ స్టార్ పెట్టుకున్న నమ్మకం ఏంటన్నది అర్ధమవుతుంది. చివరి నిమిషం వరకు పుష్పని అంచనాలను మించి వచ్చేలా చేయాలని సుకుమార్ ఈవెంట్ లకు కూడా దూరంగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ కూడా బన్నీ ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తూ డైరక్టర్ సుకుమార్ కనిపించకపోవడం హాట్ న్యూస్ గా మారింది.