అల్లు అర్జున్ -  సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా పక్కా మాస్ అనిపించేలా ప్రేక్షకులను అలరించడం గమనార్హం. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్  రష్మిక మొదటిసారి గా డీ గ్లామర్ రోల్ లో నటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కన్నింగ్ గా, సెల్ఫిష్ గా కూడా ఉంటుందట.


ఇకపోతే దాదాపుగా ఐదు కోట్ల రూపాయల విలువ చేసే సెట్ ను  ఏర్పాటు చేసి మొదటి సారి స్టార్ హీరోయిన్ సమంతా చేత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేయించారు. ఇక యూట్యూబ్లో అయితే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. పురుషజాతిని అవమానించేలా ఈ పాట ఉందంటూ కోర్టులో పురుష సంఘం కేసు వేయడం కూడా జరిగింది. ఇక ఈ ఇష్యూ  ఒకపక్క పెద్ద దుమారం రేపుతున్నా . ఈ సినిమాను డిసెంబర్ 17 వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అన్ని భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ కు సంబంధించిన సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు అట. ఇక ఈ నేపథ్యంలో సుకుమార్ పై అల్లు అర్జున్ కూడా బాగా ఫైర్ అయినట్లు సమాచారం.


ఇకపోతే ప్రముఖ యాక్టర్ గా గుర్తింపు పొందిన ఉమైర్ సంధు తన ట్విట్టర్ ద్వారా.." నాకు తెలిసి 2021 సంవత్సరానికి టాలీవుడ్ బెస్ట్ ఫిలిం పుష్ప మాత్రమే.." అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం తో ప్రస్తుతం ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే మరికొంతమంది ఇతను అబద్ధం చెబుతున్నాడు అని అంటుండగా.. మరి కొంతమంది హిందీ సెన్సార్ కాపీనే పూర్తి కాలేదు.. అభిమానులను పెంచుకోవడానికి ఇలా సృష్టిస్తున్నారు అంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పక్కా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని.. కచ్చితంగా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: