రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో మన చెప్పనవసరం లేదు. ఇక అంతే కాకుండా ఈయనకి యావత్ దేశం మొత్తం కొన్ని అభిమాన సంఘాలు కూడా ఉన్నాయట. దీంతోనే ప్రభాస్ రేంజే ఎంత పెరిగిందో మనకు అర్థమవుతోంది. బాహుబలి సినిమాలో ఎప్పుడైతే నటించాడో అప్పుడే ఈయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఊహించని పాపులారిటీ కూడా అందుకున్నారు ప్రభాస్.
ఇక అలాగే తన స్టార్ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా అన్ని పాన్ ఇండియా మూవీలనే తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మూవీలన్ని కలిస్తే కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతోందని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్, ప్రభాస్ హీరోగా కలిసి నటిస్తున్న మూవీ రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడుగా జరుగుతోంది. ఇక ఇది ఒక పీరియాడిక్, లవ్ స్టోరీ గా తెరకెక్కించ బడుతోంది. ఇందులో గ్రాఫిక్స్ తో పాటు విజువల్ వండర్స్ కూడా బాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇందులో కృష్ణంరాజు, నటి భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారట.