ప్ర‌తిభ‌కు లోటే లేని చోటు ద‌గ్గ‌ర నేనున్నాను

నేనే కాదు మీరంతా ఉన్నారు

 ఈ సినిమా విజ‌యం సాధించి న‌లుగురికీ

అన్నం పెడితే ఆ ఆనందంలో నేనుంటాను

నాతో పాటే మీరూ  ఉంటారు

మ‌హ‌మ్మారుల విజృంభ‌ణ నుంచి మ‌నం బ‌య‌ట ప‌డితే

ఆ అవ‌రోధాలు దాటుకుని వ‌స్తే అడ‌వి నిర్మ‌లం మ‌న‌సు నిశ్చ‌లం

అనండిక ఆజ్ కా రాజ్ పుష్ప రాజ్


నేను  ఓ ఒడ్డున ఉండిపోయాను.. నేను ఓ ఊబిలో కూరుకుపోయాను.. న‌న్ను ఒడ్డు నుంచి మ‌రో ఒడ్డుకు  న‌డిపించింది ఒక తీరం నుంచి మ‌రో తీరం వ‌ర‌కూ ప్ర‌యాణించేందుకు స‌హ‌క‌రించింది ఒక్క‌రే.. అతడే బ‌న్నీ.. అని క‌వితాత్మ‌క ధోర‌ణిలో చెప్తారు సుక్కూ.. నేనిప్పుడు సందిగ్ధావ‌స్థ‌లో ఉన్నాను.. సినిమా ఎలా ఉన్నా నేను ప్రేమించిన విధానాన్ని నా యూనిట్ అంతా ప్రేమించాలి.. ప్రేమించారు.. ప్ర‌తి పాత్ర‌కూ ఏదో ఒక ఐడెంటిటీ ఇవ్వ‌డం ఈ సినిమాతోనే ఎందుకు సాధ్యం చేశానంటే అదంతా క‌థ‌లో భాగం.. నేను ఎంచుకున్న వ‌స్తువు విభిన్నం క‌నుక ఆలోచ‌న మ‌రియు సంవిధానం కూడా కొత్త‌గా ఉండాల‌న్నది నా పంతం.. ప‌ట్టుద‌ల కూడా! బ‌న్నీ లేక‌పోతే ఈ సినిమా లేదు అన్న‌ది నిజం .. మైత్రి లేక‌పోతే ఈ సినిమా రాదు అన్న‌ది కూడా నిజం.. అని అంటున్నారు సుక్కూ...


సినిమా ఏమ‌యినా కానీ అది క‌ళా రూపం

కానీ ఓ సినిమాకు ప‌డే క‌ష్టం జీవ‌న వ్య‌థ‌కు సంకేతం

ఇట్స్ ఎ సింబాలిక్ యాస్పెక్ట్ ఆఫ్ హార్ట్ వ‌ర్క్

డెడికేష‌న్ అండ్ పేష‌న్...

రాత్రి ప్రెస్మీట్ కు వ‌చ్చాడు సుక్కు.. మాట్లాడ‌లేనంత నెర్వ‌స్ గా ఉన్నాడు.. ఊపిరి నుంచి ఊపిరి వ‌ర‌కూ సినిమా అనే ధ్యాస ఒక‌టి అత‌డిని ఇబ్బంది పెడుతోంది. ఈ సినిమా గురించి నేనేం మాట్లాడినా అది ఎక్కువే అవుతుంది.. నేనేం చెప్పినా అది అతికి మ‌రో రూపం అయి ఉంటుంది. బ‌ట్ ఇట్స్ ఎ ఒన్ కైండ్ ఆఫ్ హైప‌ర్ ఇంటెన్ష‌న్. సినిమా పై ప్రేమ మాత్ర‌మే మాట్లాడుతోంది. చేసిన త‌ప్పులు చేయాల్సిన త‌ప్పులు అన్నీ మాట్లాడుతున్నాయి. సుక్కూ, బ‌న్నీ ఒక‌రికొకరు అన్నంతగా ఉన్నారు. ఆ విధంగానే త‌మ‌ని తాము ప్రేమించుకుంటున్నారు. మీడియా మీట్ లో ఇంటెలెక్ట్యువ‌ల్ టాక్.. మామూలుగా లేదు. ద‌టీజ్ సుక్కూ.


మరింత సమాచారం తెలుసుకోండి: