ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప చిత్రం పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రం అయిదు భాషల్లో తెరకెక్కే ఈ రోజు ఐదు భాషల్లో సినిమాను విడుదల చేసింది చిత్ర బృందం. తొలిసారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటించగా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్లో మంచి స్థానం సంపాదించాలని అల్లు అర్జున్ భావించాడు. ఆయన అలా భావించిన నేపథ్యంలోనే ఈ సినిమా స్థాయిని పెంచి పాన్ ఇండియా సినిమా ను ఈ రోజు విడుదల దాకా తీసుకు వచ్చాడు దర్శకుడు సుకుమార్.

వీరిద్దరి కలయికలో గతంలో ఆర్య మరియు ఆర్య 2 అనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా అవి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అయితే వీరి కలయికలో వచ్చిన మూడవ చిత్రం ప్రేమ కథ సినిమాగా కాకుండా ఓ మంచి యాక్షన్ ఫిల్మ్ గా ఉండాలని సుకుమార్ అప్పుడే ఏరికోరి మరీ ఈ పుష్ప చిత్రాన్ని ఎంచుకోగా అప్పుడే టాలీవుడ్ లో పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవ్వడం అందరు హీరోలు ఆ తరహా సినిమాలు చేసుకోవడంతో ఈ చిత్రాన్ని కూడా ఆ విధంగానే తెరకెక్కించాలనే ఆలోచన వారిలో స్ఫురించింది.

అయితే ఈ విధంగా వారికి ఆ ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పుష్ప సినిమాను మొదలుపెట్టి అద్భుతం గా తెరకెక్కించి ఈరోజు విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. తెలుగులో ఈ సినిమా భారీ విజయం దక్కిందనే వార్తలు వస్తు ఉండగా ఇతర భాషలలో సైతం ఈ సినిమాకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుండడం విశేషం. మలయాళంలో ఇప్పటికే అల్లు అర్జున్ కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ సినిమా కు ఎలాగో మంచి పేరోస్తుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఆయన ఇతర భాషలలో కనిపించబోతుండగా అక్కడ ఈ సినిమాకు ఎలాంటి పెరోస్తుంది అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: