ఈటీవీ, స్టార్ మా కామెడీ స్కిట్స్ పేరుతో వాళ్లు చేస్తున్న అతి అందరికి తెలిసిందే. ఆడియెన్స్ ను నవ్వించడానికే అని చెబుతున్నా అప్పుడప్పుడు డోస్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈమధ్య ఈటీవీ నుండి స్టార్ మాకి కామెడియన్స్ జంప్ అవుతున్నారు. వాళ్లు ఛానెల్ పేరు ప్రస్థావించకుండా చేసే కామెడీ ఆడియెన్స్ కు ఫన్ జెనరేట్ చేస్తుందేమో కాని ఇన్నాళ్లు ఆ ఛానెల్ లో చేసి వచ్చి ఆ ఛానెల్ మీద జోకులేయడం మాత్రం సబబు కాదని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా కామెడీ స్టార్స్ కు జబర్దస్త్ లో చేసిన జీవన్ అక్కడ నుండి స్టార్ మా కామెడీ స్టార్ లోకి వచ్చేశాడు. కరోనా టైం లో జీవన్ కొన్నాళ్లు జబర్దస్త్ కు దూరం కాగా రీ ఎంట్రీ నుండి అక్కడ అతని టీం సరిగా స్కోర్ చేయలేకపోవడంతో జబర్దస్త్ డైరక్టర్స్ నిరాశపడటంతో జీవన్ స్టార్ మాకి షిట్ అయ్యాడు. అయితే ఇక్కడ భాస్కర్ తో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్ స్కిట్ ప్రోమోలో మీరు ఈ లాడ్జుకి సంబందించిన వారా అంటే.. మేము ఈ లాడ్జ్ నుండి వచ్చిన వాళ్లమే కాని ఇది మా లాడ్జ్ అని.. ఈటీవీఎ, స్టార్ మా ల గురించి ప్రస్థావించారు.

ఈటీవీ జబర్దస్త్ నుండి జీవన్ రాగా.. భాస్కర్ అదే ఈటీవీ పటాస్ షో నుండి స్టార్ మాకి వచ్చాడు. కామెడీ స్టార్స్ లో ఇప్పుడు పనిచేస్తున్న వారంతా ఈటీవీ నుండి వచ్చిన వారే. అక్కడ నుండి వచ్చి ఆ టీవీ మీదే పంచులు వేస్తూ తాము చేసేది కామెడీ అంటున్నారు కమెడియన్స్. అయితే ఇవేమి పట్టించుకునే తీరిక ఓపిక ఆడియెన్స్ లేదు కాబట్టి వారు చేసే కామెడీని మాత్రమే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 8 ఏళ్లుగా జబర్దస్త్ తిరుగులేని కామెడీ షోగా నడుస్తుండగా దానికి పోటీ ఇవ్వాలని స్టార్ మా గట్టి ప్రయత్మాలు చేస్తున్నా కామెడీ స్టార్స్ మాత్రం అంతా క్లిక్ అవ్వట్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: