అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.ఆ అభిమానులు లొకేషన్ వద్దకు చేరుకుని పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
పవన్ కళ్యాణ్ వచ్చాడు అన్న ఆనందంలో అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో షూటింగ్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు
రానా డానియల్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ‍్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ సినిమాకు రీమెక్‌గా వస్తోంది భీమ్లా నాయక్ సినిమా. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.