19 మంది తో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. ఇకపోతే బిగ్ బాస్ చివరి ఎపిసోడ్స్ లో గత సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు మాజీ కంటెస్టెంట్ లు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా ఐదవ సీజన్ లో మాజీ కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నారు. సీనియర్లు హౌస్ లోని ఫైనలిస్టు లతో ముచ్చటించారు. ఇక అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అయిన గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా, హరితేజ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేయబోతున్నారు.
కాకపోతే బయట కరోనా పరిస్థితులు రోజురోజుకీ మరింత పెరుగుతుండటంతో కరోనా అంశాలను పాటిస్తూ అయిదుగురు మాజీ కంటెస్టెంట్ లు లోపల ఉన్న కంటెస్టెంట్ లతో రూమ్ లో నుంచి మాట్లాడనున్నారట. మరి మాజీ కంటెస్టెంట్ ల రాకతో బిగ్ బాస్ ఎపిసోడ్ వెలిగి పోవడం ఖాయం అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కంటెస్టెంట్ లో ఎవరెవరికి బూస్ట్ చేస్తారు, ఎవరిని ఆట ఆడేసుకుంటారో చూడాలి మరి. ఇక పోతే మరొక రెండు రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఏదో కంటెస్టెంట్ ల తో పాటు, ప్రేక్షకులు ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కంటెస్టెంట్ లు మాత్రం టెన్షన్ తో అల్లాడుతున్నారు. ఇక ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నది తెలియాలి అంటే మరొక రెండు రోజులు వేచి చూడాల్సిందే మరి. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తికరంగా మారింది.