హ్యాట్రిక్ కాంబో.. తారాస్థాయిలో అంచనాలు.. భారీగా రిలీజ్ ఇవన్ని పుష్ప ఫస్ట్ డే ఓపెనింగ్ కు బాగా సహకరించాయి. సినిమా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ జాతర చూపించారు. ఫస్ట్ డే రిలీజైన అన్ని చోట్ల 90% ఆక్యుపెన్సీ రాబట్టినట్టు తెలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర తగ్గేదేలే అనిపించేలా బన్నీ పుష్ప ఫస్ట్ డే కలక్షన్స్ ఉన్నాయి. నైజాం లో ఐదు షోలు.. యూఎస్ లో భారీ ప్రీమియర్లు.. అక్కడ భారీ రిలీజ్ అవడం కూడా ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్ట్ చేసేలా చేసింది.
అల్లు అర్జున్ కెరియర్ లో ఫస్ట్ టైం 50 కోట్లకు దగ్గరగా ఫస్ట్ డే కలక్షన్స్ రాబట్టాడని చెప్పొచ్చు. చూస్తుంటే పుష్ప ర్యాంపేజ్ ఇలానే కొనసాగేలా ఉంది. సెంటిమెంట్, లవ్, యాక్షన్, స్టోరీ ఇవన్ని కలిపి పుష్ప క్రేజీ హిట్ కొట్టేలా చేశాయి. మరి ఫస్ట్ డే 50 కోట్లు రాబట్టిన పుష్ప ఇదే ఊపు కొనసాగిస్తాడని అర్ధమవుతుంది. పోటీగా వేరే సినిమా కూడా లేకపోవడంతో పుష్ప వారం వరకు వసూళ్ల హంగామా చూపించే అవకాశం ఉంది. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన పుష్ప ఏ మేరకు రాబడుతుందో చూడాలి.