తెలుగు సినిమా పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడానికి ఆజ్యం పోసింది అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా దేశంలోనే తొలిసారిగా ఈ పాన్ ఇండియా సినిమాలు రావడానికి శ్రీకారం చుట్టింది. ఆ విధంగా ఆ సినిమా వచ్చిన తర్వాత ఇతర భాషల్లోని దర్శక నిర్మాతలు హీరోలు అందరూ సినిమాలు చేయడంపై దృష్టి పెట్టి ఇప్పుడు ఎక్కువగా ఆ చిత్రాలన్ని నిర్మిస్తూ వచ్చారు.  అలా బాహుబలి సినిమా తర్వాత కన్నడ సినిమా పరిశ్రమ నుంచి కేజిఎఫ్ సినిమా వచ్చి ఒక్కసారిగా దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది.

ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమ కూడా పాన్ ఇండియా సినిమాలను చేయడంపై భారీగా దృష్టి పెట్టింది. ఇప్పటికే పెద్ద హీరోలు అందరూ కూడా ఈ సినిమాలు చేసి తమదైన ముద్ర చూపించే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని తమిళ మీడియా వర్గాలు చెప్పేది ఏమిటంటే తమిళ అగ్ర హీరోలైనా విజయ్ సూర్య అలాగే ధనుష్ వంటి హీరోలు దేశం మొత్తం ఇంపాక్ట్ ఉండేలా సినిమాలను చేయాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో తెలుగు సినిమా పరిశ్రమ విఫలం అవుతుందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిన సినిమా ఇంతవరకు రానేలేదు. భవిష్యత్తులో మన సినిమాలు దేశం మొత్తం ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందా అనేది చూడాలి. మరి సౌత్ సినిమా పరిశ్రమలో తమిళ సినిమా పరిశ్రమ సినిమాల విషయంగా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తమ పనితనంతో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి. ఇక తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇవి ఎంతాగా ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: