స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పాపులర్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమాని అల్లు అర్జున్ కెరీర్ లోనే మొదటి సారిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం జరిగింది. డిసెంబర్ 17వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ.. ఈ మూవీ అటు అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినట్లుగా సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాపై నిన్నటి నుంచి ఎక్కువగా ట్రోలింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని ఏరియాలలో పుష్ప సినిమా అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం తమిళనాడులో పుష్ప కలెక్షన్లు చూసి అందరూ ఒక్క సారిగా షాక్ కు గురవుతున్నారు. ఏకంగా తమిళనాడులో ఫస్ట్ డే నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.



అల్లు అర్జున్ తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల ఇదంతా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా నాన్ బాహుబలి రికార్డులను సైతం కొట్టిపారేసినట్లుగా తెలుస్తోంది. కానీ సొంత భాషలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేక పోతోంది ఈ సినిమా. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ ఇలా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా సినిమా హైప్ ను పెంచలేక పోయారు. కొంత మంది స్టార్ హీరోలు కూడా ఈ సినిమా స్టోరీ విని రిజెక్ట్ చేసినట్లుగా కూడా సమాచారం.


ఇకపోతే ఈ సినిమా  మీద  అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రెండు సంవత్సరాలుగా ఎన్నో అంచనాలను పెట్టుకున్నప్పటికీ.. సుకుమార్ మాత్రం ప్రేక్షకులు అంచనాలను నెరవేర్చలేక పోయాడు. అంతేకాదు అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్ ను ఇలా చూపించడం వల్లే అక్కడ ఆయన బోల్తా కొట్టాడు అని చెప్పవచ్చు. ఆర్య సినిమా లో ఒక్కటే వీరిద్దరి కాంబినేషన్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆర్య టు సినిమా కూడా అల్లు అర్జున్ స్టైల్ ప్రేక్షకులకు నచ్చక యావరేజ్ గా నిలిచింది. దీంతో పుష్ప టు కూడా ఏమవుతుందో అని  చెప్పలేము అన్నట్లుగా సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: