నిర్మాతల లెక్కల ప్రకారం దాదాపు 180 కోట్లతో తీసిన సినిమా ఇది అని తెలుస్తుంది.. నిజానికి ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా క్వాలిటీ పరంగా అదరహో అనిపించేలా ఉండాలట.. సుకుమార్ తీసిన సినిమాలు సాంకేతికంగా అద్భుతంగా ఉంటాయని అందరికి తెలుసు.. అందుకు ‘వన్’ నేనొక్కడినే, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటివి ఉదాహరణలగా చెప్పవచ్చు. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ మరియు అలా వైకుంఠపురంలో’ తర్వాత బన్నీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావటంతో సాంకేతికంగా ఎంతో ఉన్నత ప్రమాణాలను ఊహించుకుంటారని తెలుస్తుంది..
అయితే 'పుష్ప' సినిమా టెక్నికల్ గా చాలా వీక్ గా ఉందనేది టాక్ నడుస్తుందట.దేవిశ్రీ ప్రసాద్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి మరియు సినిమాటోగ్రాఫర్ మిరస్లోవ్ కూబా వంటి మహామహులు పని చేసిన ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ డల్ గా కనిపించిందన్నది పలువురి మాట. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదట.. అయితే ఆ క్వాలిటీ తెరపై కనిపించకపోవడానికి సమయం లభించకపోవడమా అంటే అవుననే అంటున్నారట.. పోస్ట్ ప్రొడక్షన్ హడావుడిగా చేసేయడం అలాగే విడుదలకు రెండు వారాల ముందు వరకు షూటింగ్ చేయటంతో ఎడిటింగ్ కూడా అంత షార్ప్ గా అనిపించలేదని తెలుస్తుంది.. ఇక సినిమాలో ల్యాగ్ బాగా ఎక్కువైందట.టైమ్ లేక పోవడంతో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే వీలు లేక పోయిందట.
సెన్సార్ కి కూడా రా మెటీరియల్ నే పంపించి మమ అనిపించారట.. మల్టీప్లెక్సుల్లో క్వాలిటీ అసలు కనిపించలేదని తెలుస్తుంది.అమెరికాకి అసలు ఫినిష్డ్ వెర్షన్ వెళ్లలేదని తెలుస్తుంది.. ఎడిటింగ్ ఫైనల్ మిక్సింగ్ సరిగా లేని ప్రింట్స్ వెళ్ళాయని టాక్ నడుస్తుంది.సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసి ఉండటం వచ్చిన ముప్పు ఇదట.సినిమాకు వచ్చిన బ్యాడ్ టాక్ లో చాలా భాగం హడావుడిగా పనులను పూర్తి చేసి మార్కెట్ లోకి పంపడం వల్లే వచ్చిందంటున్నారట.మరి రిలీజ్ తర్వాత అయినా దీనిని సవరించుకుంటారో లేదో చూడాలి మరి.