ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా థియేట్లు, సినిమా వ్యవహారాలు అన్నీ ఇప్పుడు రాజకీయాల చుట్టూ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి కాలంలో పవర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వం టికెట్ రేట్ల పై నియంత్రణ విధించింది. టిక్కెట్ రేట్లు 1990 సంవత్సరానికి పూర్వం ఎలా ఉన్నాయో ? ఆ రేట్ట‌కే టిక్కెట్లు అమ్మాలని కఠిన నిబంధనలు విధించింది. అలాగే అదనపు షోలు ... బెనిఫిట్ షో లకు అనుమతులు ఇవ్వకుండా చేసేసింది.

మరోవైపు టిక్కెట్లు ఆన్లైన్లోనే అమ్మాలని ప్రభుత్వమే స్వయంగా ఒక జీవోను, పోర్ట‌ల్‌ను కూడా తెచ్చింది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు రెండు మూడు సార్లు ఏపీ మంత్రి పేర్ని నాని తో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇక కొందరు స్టార్ హీరోలు , అగ్ర నిర్మాతలు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా రెండుసార్లు కలిశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అనుకూలంగా ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు అదనపు షోలు.. నియంత్రించటం, బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడంతో సినిమా ప్రేక్షకులకు కూడా రిలీజ్ రోజు ఉదయం సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎంత హంగామా ? ఉంటుందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. కనీసం సినిమా రిలీజ్ రోజు కూడా ఉదయం షో వేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే బాలకృష్ణ అఖండ సినిమా విషయంలో ఉదయం నుంచి బెనిఫిట్ షోలు వేశారు.

ఆంధ్రప్రదేశ్లో అఖండ బెనిఫిట్ షోలు తెల్లవారుజామునుంచే చాలా చోట్ల వేసేశారు. పైగా వైసీపీకి చెందిన నేతలే దగ్గరుండి మరి ఈ షో లు వేయించారు. అయితే బన్నీ పుష్ప విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అంతా పట్టుదలతో వ్యవహరించింది. బెనిఫిట్ షోలు షోలు ... చివరకు మల్టిప్లెక్స్ లలో షోల‌పై సైతం నియంత్రణ విధించింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగన్ బన్నీ సినిమా విషయంలో అంత‌ పట్టుదలతో ఉంటారని ఎవరూ వూహించలేదు. అయితే రాజకీయంగా జగన్ కు బాలయ్య ప్రత్యర్థి. అయినా బన్నీని ఇంతలా ఎందుకు ? టార్గెట్ చేశారు అన్నది ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: