సినిమాకు ఓ పక్క మిక్సెడ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో మాత్రం దూసుకెళ్తుంది. ఇప్పటికే నైజాం లో 11.44 కోట్లతో ఆల్ టైం ఫస్ట్ డే వసూళ్ల రికార్డ్ ను క్రియేట్ చేసిన పుష్ప వరల్డ్ వైడ్ గా 71 కోట్లను తెచ్చి 2021 లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ డే హిందీలో కూడా 3 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్, రష్మిక డీ గ్లామరస్ నటన, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్ని సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
ఇక సినిమా రన్ టైం విషయంలో ఆడియెన్స్ నుండి నెగటివ్ టాక్ వచ్చినా సరే ఆ ప్రభావం ఏది వసూళ్ల మీద పడలేదని మాత్రం తెలుస్తుంది. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన పుష్ప ఫస్ట్ వీకెండ్ లోనే 100 టూ 130 కోట్ల దాకా వసూళ్లు రాబట్టేలా ఉంది. అల్లు అర్జున్ భారీ నమ్మకాలు పెట్టుకున్న ఈ పుష్ప విషయంలో బన్నీ ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగురవేసేలా చేశాడు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ సినిమా వసూళ్లు అన్నిచోట్ల బ్రాహ్మాండంగా ఉన్నాయి. ఫస్ట్ డే మాత్రమే కాదు సెకండ్ డే కూడా అదే జోరు కొనసాగుతుందని తెలుస్తుంది.