180 కోట్లు ఖర్చు అన్నది పెద్ద అబద్ధం
ఆ సంగతి ఎవ్వరిని అడిగినా తేలిపోతుంది
సినిమా లెక్క కూడా తేలిపోయింది
తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ కు ఉన్నంత
ట్రెండ్ సెట్టింగ్ పాయింట్ ఏదీ కూడా సినిమాలో ఎక్కడా లేదు అన్నది
కూడా స్పష్టం అయిపోయింది. సో ఇట్స్ క్లియర్..
గొప్ప గొప్ప నటులను ఎంచుకోవడం మాత్రమే కాదు
వారితో కలసి పనిచేయడం పనిచేయించుకుని తీరడం
అన్నవి కూడా నేర్చుకోవాలిక సుక్కూ భాయ్ మరియు బన్నీ బాబు.
ఆశించిన విధంగా సినిమా లేదు.. అనుకున్న విధంగా ఆన్ స్క్రీన్ మ్యాజిక్ లేనలేదు. మిగతా భాషల్లో అయితే అస్సలు టాక్ అన్నది బయటకు రానే లేదు. మొదట్నుంచి బన్నీ బాబు ఇచ్చి స్టేట్మెంట్ల కారణంగా సినిమాకు ఇంతటి నెగిటివ్ టాక్ వచ్చిందన ఒపీనియన్ కూడా బయట వినిపిస్తూ వస్తోంది. పుష్ప ద రైజ్ లో బన్నీ క్యారెక్టర్ ఎలివేషన్లపై ఉన్న శ్రద్ధ మిగతా పాత్రలపై పెద్దగా చూపలేదన్న విమర్శకు రేపటి వేళ సుక్కూ ఏమని సమాధానం చెబుతారో చూడాలిక.
ఇంకా చెప్పాలంటే....
పుష్ప సినిమా కు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ముందుగా ఆ కాంబినేషన్ కే సగం మార్కులు పడిపోయాయి ప్రేక్షకుల నుం చి.. ఆర్య సినిమా దగ్గర నుంచి నిన్నటిదాకా అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు ఆ ఇద్దరూ.. కానీ ఈ సారి మాత్రం అనుకున్నది చేయలేకపోయినారు. అనుకున్నంత కూడా చేయలేక పోయారు. ఊహించిన స్థాయిలో పనిచేయలేకపో యా రు. ఇతరుల ఊహలకు ముఖ్యంగా సినీ ప్రేమికుల ఊహలకు అస్సలు చేరుకోలేక ఈ కథ కు ఆ పాత్రలకు అర్థం ఏంటన్నది చెప్పలే కపోయారు తాజా చిత్రం పుష్ప ద రైజ్ లో! అంతేకాదు కథ దగ్గర నుంచి కథన రీతి వరకూ ఎక్కడా కూడా పెద్దగా కొత్తదనం అయితే లేదు. ఆ మాటకు వస్తే రంగస్థలం కథ కూడా గొప్పది కాదు కానీ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం కాస్త కొత్తగా విభిన్నం అయిన రీతిలో ఉంది. కానీ ఈ సినిమా మాత్రం ఆ సినిమా పోకడలను ఎన్ని సార్లు గుర్తు చేసిందో! ఆఖరికి ఈ సినిమా పల్టీలు కొడుతోందని టాక్. బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం రాలేదని అంటున్నారు ఇంకొందరు. ఈ వీకెండ్ దాటిపోతే సిసలు రంగు ఏంటన్నది తేలిపోతుంది.