ముఖ్యంగా రాబోవు బడా సినిమాల్లో ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, ఆచార్య లపై అందరిలో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉండగా వీటిలో ఇప్పటికే దాదాపుగా అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే ఇటీవల ఆర్ఆర్ ఆర్ సినిమా ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ యూనిట్ ప్రకటించడంతో అప్పటికే సంక్రాతి బరిలో ఉన్న మహేష్ సర్కారు వారి పాట ఏప్రిల్ కి వాయిదా పడింది. ఇక ఆ తరువాత రాధేశ్యామ్ కూడా జనవరి 14న రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా, అంతకముందు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా జనవరి 12న వస్తున్నట్లు అనౌన్స్ చేసారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో చిరంజీవి ఆచార్య రానునంట్లు ఆ మూవీ మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది.
కాగా ఈ సినిమాల్లో భీమ్లా నాయక్, ఆచార్య మూవీస్ రెండూ కూడా మరొక్కసారి వాయిదా పడనున్నాయి అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పవన్ తన భీమ్లా మూవీ ని ఫిబ్రవరి కి వాయిదా వేయనుండగా, ఈ మూవీ కోసం ఆచార్య ని మార్చి చివరకి తీసుకెళ్లనున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ, నిజంగానే ఈ మెగా సోదరుల ఇద్దరి సినిమాలు వాయిదా పడనున్నాయా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే మాత్రం ఆయా సినిమాల యూనిట్స్ నుండి అధికారిక ప్రకటనల వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.