బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5గా ఉన్న సిరి కొద్దిసేపటి క్రితమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. పుష్ప టీం గా వచ్చిన దేవి శ్రీ ప్రసాద్, రష్మిక హౌజ్ లోకి వెళ్లి సిరిని హౌజ్ నుండి తీసుకొని వచ్చారు. బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ మీదకు వచ్చిన సిరి తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నానని.. రెండు రోజుల క్రితం ఫేక్ ఎలిమినేషన్ అన్నప్పుడే తన ఎమోషన్ అంతా చూపించేశా అన్నది.

ఇక 15 వారాల పాటు తనని భరించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ అని చెప్పింది. అంతేకాదు తనకి ఓట్ వేసి ఇక్కడివరకు తెచ్చిన ఆడియెన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ అన్నది సిరి. ఇక విన్నర్ ఎవరు అని నాగ్ అడిగితే ఇంకెవరు సర్ షణ్ముఖ్ అన్నది సిరి. బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ తో సిరి చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసింది. సిరి లేకపోతే షణ్ముఖ్ ఇంకాస్త బాగా ఆడేవాడని అతని ఫ్యాన్స్ అనుకున్నారు.

అంతేకాదు షణ్ముఖ్ టైటిల్ విజేతగా అవకపోవడానికి కారణం కూడా సిరినే అంటున్నారు. అయితే సన్నీ విన్నర్ అని తను అంచనా వేయలేదు కాబట్టి షణ్ముఖ్ విన్నర్ అవుతాడని కాన్ ఫిడెంట్ గా చెప్పింది సిరి. కాని బయటకు వచ్చాక ఆమెకు అసలు విషయం అర్ధమయ్యి ఉండొచ్చు. మొత్తానికి సిరి బిగ్ బాస్ హౌజ్ ఆట ముగిసింది. షణ్ముఖ్ తో ఫ్రెండ్ షిప్ పక్కన పెడితే ఆటల్లో ఆమె చూపించిన ప్రతిభ ఆమెను టాప్ 5 వరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సిరి టాప్ 5 వరకు వెళ్లింది కూడా షణ్ముఖ్ తో ఉండటం వల్లే అన్న వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా సిరి బిగ్ బాస్ 5లో తన మార్క్ చూపించిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: