మంచు లక్ష్మి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కూతురు గా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సినిమాలలో కూడా తన ప్రతిభను చూపించి.. ఆమె ఏమిటో అందరికీ తెలియజేసింది. మంచు లక్ష్మి అమెరికాలో తన విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే పలు షోలలో యాంకర్ గా పని చేసేది. ఆ తర్వాత ఇండియాకి వచ్చి తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. ఇక తనలో ఉన్న ప్రతిభను మెచ్చిన దర్శకులు సినిమాలలో విలన్ పాత్రలో ఈమెకు అవకాశం ఇచ్చారు. ఒకవైపు విలన్ పాత్రలో నటిస్తూ..మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచులక్ష్మి.


ఇక సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తాజాగా పుష్ప సినిమాలో ఐటెం సాంగులో నటించి దక్షిణ భారతదేశం లోనే కేవలం ఇరవై నాలుగు గంటలలో ఎక్కువ మంది చూసిన వీడియో గా ఊ అంటావా .. ఊఊ అంటావా మామ అనే పాట రికార్డు సృష్టించింది. ఇక ఈ పాటతో ఓవర్ నైట్ లోనే  స్టార్ హీరోయిన్ కాస్త  తన క్రేజ్ మరింత పెరిగి పోయిందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ విషయాన్ని చూసిన మంచు లక్ష్మి సమంత సాధించిన రికార్డును తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ. సమంత  ఏంటో ఒక్కమాటలో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..

మంచు లక్ష్మి తన ట్విట్టర్ ద్వారా.. సమంత అత్యంత ప్రతిభావంతులైన నటి.. ఈమె అసాధారణమైన పాత్రలు చేయడానికి కూడా ఎప్పుడూ వెనుకాడదు.. అందుకు ఉదాహరణ ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో ఆమె చేసిన రాజీ పాత్ర అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి థియేటర్లలో టెంపరేచర్ పెంచేసింది.. నిజం చెప్పాలంటే ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ పాత్రలలో మరే టాప్ హీరోయిన్ కూడా చేయలేరు. సమంత ధైర్యవంతురాలు మాత్రమే కాకుండా ప్రతిభావంతురాలు కూడా.. ఇక నేను గట్టిగా చెప్పే మాట ఏమిటంటే.. సమంత 1000 % గ్రేట్ యాక్ట్రెస్ అని.. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: