తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ రాజమౌలి అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఉండరెమో ప్రపంచం మెచ్చుకునే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరును సంపాదించాడు.. ఈయన సినిమాలు కాస్త లెట్ అయిన భారీ విజయాన్ని అందుకుంటాయి. అందుకే స్టార్ హీరోలు జక్కన్న తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు.. ఇక విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని రూపొందించారు.. భారీ అంచనాల తో మరి కొన్ని రోజుల్లో ప్రెక్షకుల ముందుకు వస్తుంది.


ఈ సినిమాలొ టాలివుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలివుడ్ ప్రముఖులు కూడా ఇందులో కీలక పాత్రల్లొ నటిస్తున్నారు.అల్లూరి, కొమురంభీమ్‌ కలిసి స్నేహితులు గా బ్రిటీష్‌ ప్రభుత్వం పై చేసిన పోరాటం కు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్ లు గా అజయ్ దేవగన్, శ్రీయ కూడా ప్రత్యేక పాత్రలలొ కనిపిస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఈ చిత్ర ప్రీ రీలిజ్ ఈవెంట్‌ అట్టహాసంగా ముంబాయి లో జరిగింది. తెలుగు, హిందీ అభిమానుల కోసం ఈవెంట్ ను అక్కడ ప్లాను చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ లో బాలివుడ్ లోని ప్రముఖులు హాజరై సందడి చేశారు. భారీగా చేసిన ఈ కార్యక్రమాని కి అభిమానులు కూడా ఎక్కువగానే వచ్చారు. సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ గా హాజరయ్యారు. సందడి చేశారు. ఈవెంట్‌కి మరింత హైలెట్ గా నిలిచారు. భువన్ రామ్ వంటి స్టార్స్ కూడా హాజరై సందడి చేశారు.ఎన్టీఆర్ కు భువన్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి మాటలు హైలెట్ అయ్యాయి. జనవరి 7 న సినిమా విడుదల కానుంది.. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న సినిమా ఎలా వుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: