వరల్డ్ వైడ్ సెకండ్ లార్గెస్ట్ స్క్రీన్ కలిగిన మెల్ బోర్న్ లో ఉంది. అక్కడ చాలా సెలెక్టెడ్ సినిమాలు స్పెషల్ షోస్ పడుతుంటాయి. వరల్డ్ సినిమా వేదికగా ఐమ్యాక్స్ స్క్రీన్ కు చాలా పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఆ స్క్రీన్ పై మన రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ స్పెషల్ షో పడుతుంది. వరల్డ్ లార్గెస్ట్ సెకండ్ స్క్రీన్ అయిన మెల్ బోర్న్ ఐమ్యాక్స్ లో రాధే శ్యామ్ రిలీజ్ అవుతుంది. ఇది తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్త అని చెప్పొచ్చు.

రాధే శ్యామ్ సినిమా 2022 జనవరి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో భారీ స్క్రీన్ పై ఈ సినిమా వేయనున్నారు. రిలీజ్ రోజే ఈ స్పెషల్ షో పడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా లేటెస్ట్ గా ఈ స్పెషల్ షో వల్ల సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడేలా ఉందని చెప్పొచ్చు.

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా చేస్తుండగా ఆమె ప్రేరణగా కనిపిస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాటోగ్రఫీ కూడా స్పెషల్ గా ఉంటుందని విజువల్స్ చూస్తేనే అర్ధమవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహోతో వరల్డ్ సినిమాపై తన లక్ టెస్ట్ చేసుకున్నాడు. అయితే సాహో నిరాశపరచగా రాధేశ్యామ్ మాత్రం అంచనాలకు తగినట్టుగానే ప్రేక్షలులను మరో లోకానికి తీసుకెళ్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: