విక్టరీ వెంకటేష్ తన వరస చిత్రాలను ఓటిటీ లో విడుదల చేస్తు వాటి ద్వారా మంచి విజయాల ను సాధిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. రీమేక్ సినిమాలతో మంచి విజయాలు సాధించే పేరున్న వెంకటేష్ ఇప్పుడు వరుసగా రెండు రీమేక్ సినిమాలను విడుదల చేసి తనదైన స్టైల్లో వాటి ద్వారా హిట్స్ అందుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే సినిమా చేసిన వెంకటేష్ ఆ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మలయాళ సినిమా దృశ్యం2 చిత్రాన్ని కూడా చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆనందింప చేశారు.

ఈ సినిమాలతో పాటు ఆయన హీరోగా నటించిన ఎఫ్2 సినిమాకి సీక్వెల్ ఎఫ్3 చిత్రంలో నటిస్తున్నాడు.  వరుణ్ తేజ్ కథానాయకుడి గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా మరియు మెహరిన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఎంతో ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ విధంగా వరుస సినిమాలతో వెంకటేష్ దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు ఈ చిత్రం తర్వాత ఆయన చేస్తున్న తదుపరి చిత్రం ఏంటో ఎవరికి చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇటీవల కాలంలో అందరు హీరోలు తమ తదుపరి సినిమాలను ఒకేసారి ప్రకటిస్తే వెంకటేష్ మాత్రం ఇంకొకటి ప్రకటించడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించే తదుపరి సినిమాల గురించి ఇంత తొందరగా చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు వెంకటేష్ తన తదుపరి చిత్రాలను చేస్తాడా అనేది చూడాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ సినిమా ను ఆయన రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: