దానితో పాటు రిలీజ్ అయిన ఇద్దరు హీరోల టీజర్స్ కూడా అదిరిపోవడంతో భీమ్లా పై అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విషయం లోకి వెళితే, నిజానికి ఈ మూవీని రాబోయే జనవరి 12న రిలీజ్ చేస్తున్నాం అంటూ కొన్నాళ్ల క్రితం అధికారికంగా ప్రకటించిన యూనిట్, నేడు దానిని వేయిదా వేసింది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్, ప్రభాస్ పూజా హెగ్డే ల రాధేశ్యామ్ కూడా జనవరి లో వస్తుండడంతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, రాధేశ్యామ్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్యలు పవన్ కళ్యాణ్ ని, భీమ్లా నిర్మాతలు వంశి, చినబాబు లను ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చేయడంతో వారు ఒప్పుకున్నారు.
కొద్దిసేపటి క్రితం దిల్ రాజు అద్వర్యంలో జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో భాగంగా భీమ్లా నాయక్ ని ఫిబ్రవరి 25కి వాయిదా వేసేందుకు ఆ మూవీ యూనిట్ ఒప్పుకుందని చెప్పారు రాజు. ఇందుకు సహకరించిన పవన్ కళ్యాణ్, నిర్మాతలకు దిల్ రాజు సహా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా మరికొద్దిసేపటిలో భీమ్లా నాయక్ లేటెస్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ రానున్నట్లు సమాచారం.