దర్శక ధీరుడు, బాహుబలి బ్రహ్మ రాజమౌలి రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్ '.. ఈ సినిమా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్ర లలో నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాజమౌలి సినిమా అంటే మొదటి నుంచి భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా పై కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి.


చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరుల మధ్య స్నేహాన్ని జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా లో కళ్ళ కు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే ఫ్రెమ్ లో కనిపించడం అభిమానుల సంతోషం కు అవధులు లేవు.బాహుబలి సినిమా తో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అంతే విధమైన ఆలోచనలను మళ్ళీ కలిగిస్తున్నారు జక్కన్న.


సినిమా విడుదల కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. గత కొద్ది రోజులు గా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో జక్కన్నతోపాటు హీరోలు ఇద్దరు కూడా బిజిగా వున్నారు.కాగా, సినిమా పై ఆసక్తి పెంచెందుకు కొత్త ప్రయత్నాలను చేస్తున్నారు. తారక్ కొన్ని సన్నీవేశాలకు సంబంధించిన వీడియో లను విడుదల చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆనాందాన్ని అందించారు.. తాజాగా చరణ్ నటించిన అద్బుతమైన సన్నీవేశాల మేకోవర్ వీడియోలను విడుదల చేయడంతో ఫుల్ జోష్ లో వున్నారు మెగా ఫ్యాన్స్.. పాపం చరణ్ చాలా కష్టపడ్డాడు.. ఆ వీడియో ను చూస్తే మీకే తెలుస్తుంది.. ఆ వీడియో ను మీరు ఒకసారి చూడండి. మొత్తానికి సినిమా హిట్ అయ్యేలా వుంది. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: