సినీ నటుడు. రాజకీయ నాయకుడు నందమూరీ బాలకృష్ణకు కొంచెం కోపం ఎక్కువే. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే క్యారెక్టర్ బాలయ్యది. అందుకే ఆయన అంటే అందరికి వణుకు. ఎక్కడ మొహం మీదనే నిజాలు అడిగేస్తారో అని. ఇక బాలయ్య ఇటు సినిమాలు అటు రాజకీయాలను సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా అఖండతో తిరుగులేని విజయం అందుకున్న బాలయ్య..ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఓ సినిమాను లైన్లో పెట్టి ఉన్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య ఓ టాక్ షో కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆహా వారితో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి అన్ స్టాపబుల్  విత్ ఎన్ బీ కె అనే టాక్ షో ను చేస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు బడా బడా సెలబ్రిటీస్ అతిధులుగా వచ్చి బాలయ్యతో  సందడి చేసి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గానే దర్శక ధీరుడు రాజమౌళి బాలయ్య షో గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా  ఈ షోకి అతిధిగా మాస్ రాజా మహా రాజ రవితేజ గెస్ట్వ్ గా వచ్చి సందడి చేసారు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రోమో చూసిన వారు ఓ రేంజ్  లో ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా బాలయ్య-రవితేజ్ ఫన్నీ మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి . షో లోకి ఆహ్వానించిన బాలయ్య రావడం రావడమే రవితేజను .."ఏంటి మనకు ఓ హీరోయిన్ విషయంలో గొడవ అయ్యిందట కదా.." అని అడుగుతారు. దీనికి రవితేజ తనదైన స్టైల్లో డాష్ డాష్ గాళ్లు అంటూ ఆ న్యూస్ పై క్లారిటీ ఇస్తారు. అంతేకాదు రవితేజ లోని మాస్ యాంగిల్స్ ఈ షో మనం క్లీయర్ గా  చూడచ్చు. బాలయ్య అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మాస్ గానే ఆన్సర్ ఇస్తూ..రవితేజ మాస్ మహారాజ ను బయటకు తీసుకొచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షో లో మధ్యలో డైరెక్టర్ గోపిచంద మల్లినేని కూడా వస్తాడు. ఇక అప్పుడు డబుల్ సందడి మొదలైన్నట్లు ప్రోమో చూస్తేనే అర్ధమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: