బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ ఆట తీరు తన ఫ్యాన్స్ ను మెప్పించినా తన లవర్ ని మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవడం ఆమెకు నచ్చలేదు. అఫ్కోర్స్ అదే షణ్ముఖ్ ని కప్ కు దూరమయ్యేలా చేసింది. సీజన్ 5లో రన్నర్ గా నిలిచాడు షణ్ముఖ్ అయితే అతన్ని కలిసేందుకు కానీ మాట్లాడేందుకు కానీ ప్రయత్నించలేదు దీప్తి సునైనా. హౌజ్ లో సిరితో అతను అంతగా క్లోజ్ గా ఉండటం దీప్తిని హర్ట్ చేసినట్టు తెలుస్తుంది.
అందుకే అమ్మడు వరుసగా ఇన్ స్టాగ్రాం లో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ నీ మనస్సాక్షితో అయినా నిజాతీగా ఉండు అని కామెంట్ పెట్టింది. అంతేకాదు ఇది బెస్ట్ ఇయర్ కాదని కానీ చాలా విషయాలను నేర్చుకున్నా అంటూ దీప్తి సునైనా ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. ఇవన్ని చూస్తుంటే బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ చేసిన వ్యవహారం దీప్తిని బాగానే హర్ట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. సిరి, షణ్ముఖ్ మాట్లాడితే హగ్ చేసుకుని ఫ్రెండ్ షిప్ ఆంటీ అని అనడం ఆడియెన్స్ కు కూడా వారిద్దరు చేస్తున్న అతి అర్ధమైంది. మరి లవ్ బర్డ్స్ నిజంగానే విడిపోతున్నారా లేక కొద్దిగా టైం తీసుకుని కలుస్తారా అన్నది చూడాలి.