టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై నాని ఫాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బోయినపల్లి వెంకట్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో నాని కి జోడి గా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు.

 ఇక ఈ సినిమా విడుదల అవడానికి మరో రెండు రోజుల సమయం ఉండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇక ప్రమోషన్స లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు నాని. నేను నటించిన సినిమాని ఆడియన్స్ ఎప్పుడు ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సినిమాలో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. అలాగే సినిమా డైరెక్టర్ రాహుల్ ని ఇప్పుడు పొగిడితే సొంత డబ్బా కొట్టుకున్నట్లు అవుతుంది.అలాగే సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పనితీరు ఈ సినిమాలో ఎంత గొప్పగా ఉంటుందో సినిమా విడుదల అయిన తర్వాత మీకే తెలుస్తుందని తెలిపాడు.

ఇక ఇదే క్రమంలోనే నాని కి రీమేక్ సినిమాలకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మధ్య కాలంలో మీరు ఎందుకు రీమేక్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించగా..ఈ విషయం పై నాని స్పందిస్తూ..నేను గతంలో చేసిన రెండు రీమేక్ సినిమాలు నాకు పెద్ద గుణపాఠాలు నేర్పాయి. అందువల్ల మళ్ళీ ఆ వైపుకి వెళ్లాలని అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు నాని.అంతేకాదు రీమేక్ సినిమాలు తనకు అంతగా సెట్ కావని తేల్చి చెప్పాడు నాని. ఇక తాను రీమేక్ సినిమాలు చేయడం కంటే తన సినిమాలు రీమేక్ అవుతుండడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని నాని అన్నాడు. దీంతో రీమేక్ సినిమాలపై నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: