చూపే బంగారామాయనే శ్రీవల్లి సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటని సిద్ శ్రీరాం పాడారు. శ్రీవల్లి సాంగ్ యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకెళ్తుంది. శ్రీవల్లిగా రష్మిక మందన్న క్యూట్ నెస్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పటికే పుష్ప ఆల్బం లోని రెండు సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టగా కొత్తగా ఆ లిస్ట్ లో శ్రీవల్లి పాట చేరింది. పుష్ప తెలుగు వర్షన్ శ్రీవల్లి సాంగ్ మాత్రమే యూట్యూబ్ లో ఈ రికార్డ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.
ఇక పుష్ప వసూళ్ల జాతర గురించి చెబితే పుష్ప పాన్ ఇండియా సినిమాగా పుష్ప సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కూడా నటించారు. సినిమాలో ఎవరికి తగ్గ పాత్ర వారికి దక్కిందని చెప్పొచ్చు. అందుకే పుష్ప ది రైజ్ పార్ట్ 1 రిజల్ట్ అదిరిపోయింది. పుష్ప పార్ట్ 2 ది రూల్ కోసం అందరు ఎక్సయిటింగ్ గా వెయిట్ చెసేలా చేస్తుంది.