ఆ షిప్ సీన్ చూశారుగా అదిరిపోతుందని అన్నారు. సాహోతో నేషనల్ మొత్తం తిరిగిన తాను ఇక మీదట బాగా మాట్లాడాలని అనుకున్నా కాని కుదరట్లేదు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్. రాధేశ్యామ్ సినిమా మీ అందరిని అలరిస్తుందని అన్నారు ప్రభాస్. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు సినిమాలో ట్విస్టులు కూడా ఉన్నాయని చెప్పి సినిమాపై అంచనాలు పెంచారు ప్రభాస్.
రాధేశ్యామ్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. పాపులర్ హస్త సాముద్రిక నిపుణుడైన విక్రమాదిత్య తన లైఫ్ లో ప్రేమ గురించి తెలిసి కూడా ప్రేమలో పడి విధిని ఎలా ఎదురించాడు అన్నది సినిమా కథ. చూస్తుంటే విజువల్స్ ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవల్ లో అనిపించేలా ఉన్నాయి. తప్పకుండా ప్రభాస్ కు ఇది నేషనల్ వైడ్ మరో క్రేజీ మూవీగా రాబోతుందని అర్ధమవుతుంది. ఎలాగు తెలుగులో ఆయనకు ఉన్న క్రేజ్ ను సినిమా ఎలా ఉన్నా హిట్ చేసేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో నిరాశపరచగా రెండేళ్ల తర్వాత భారీ అంచనాలతో వస్తున్న రాధే శ్యాం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ అందించారు. సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. రాధే శ్యామ్ ప్రభాస్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.