సౌత్‌లో మాదిరి హీరో ఎలివేషన్లు మరియు మాస్ అంశాలు ఉంటూనే కథా బలం ఉన్న చిత్రాలు అక్కడ రావట్లేదట.. దీని వల్ల ఉత్తరాది మాస్ ప్రేక్షకులు బాలీవుడ్‌తో క్రమ క్రమంగా డిస్కనెక్ట్ అయిపోతున్నారని తెలుస్తుంది.యూట్యూబ్‌లో మరియు టీవీ ఛానెళ్లలో సౌత్ డబ్బింగ్ చిత్రాలకు అనూహ్యమైన ఆదరణ దక్కుతుండటానికి ఇదే కారణమని తెలుస్తుంది.. అల్లు అర్జున్ సహా చాలామంది సౌత్ స్టార్లు ఈ డబ్బింగ్ సినిమాల ద్వారానే ఉత్తరాదిన స్టార్ ఇమేజ్ సంపాదించడం గమనార్హం..
బాహుబలి మరియు కేజీఎఫ్ అలాగే సాహో లాంటి సౌత్ సినిమాలు ఉత్తరాదిన ఎలా వసూళ్ల వర్షం కురిపించాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ సైతం అంచనాల్ని మించి అదరగొడుతోందట.. ఈ సినిమాను ముందుగా బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు తక్కువ అంచనా వేశారని సమాచారం.. యూట్యూబ్ ఫాలోయింగ్ ఇక్కడ వర్కవుట్ కాదని తీర్మానాలు చేశారని తెలుస్తుంది.. కానీ తీరా చూస్తే ‘పుష్ఫ’ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అవాక్కయ్యేలా చేస్తోందని సమాచారం.ఈ సినిమా వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయని సమాచారం.తొలి రోజు రూ.3 కోట్ల పైచిలుకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్‌లో అదరగొట్టేస్తుండటం గమనార్హం.
సోమవారం మరియు మంగళవారం రెండు రోజుల్లోనూ రూ.4 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసిందట ‘పుష్ప’ హిందీ వెర్షన్. దీని గురించి ఆశ్చర్యపోతూ ట్వీట్లు వేశాడట ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్. ‘పుష్ఫ’ వసూళ్లు చూసి కచ్చితంగా బాలీవుడ్ జనాల లోలోన కంగారు పుడుతూ ఉంటుందనడంలో సందేహం లేదని తెలుస్తుంది.. సౌత్ సినిమాలు ఇలా ఆధిపత్యం చలాయిస్తూ నార్త్ మాస్ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటే తమ మనుగడకే ప్రమాదం వస్తుందన్న ఆందోళన వారిలో కలగకుండా ఉండదని కానీ అక్కడి మాస్‌ను మన సౌత్ డైరెక్టర్లలాగా మెస్మరైజ్ చేసే దర్శకులే కనిపించకపోవడమే పెద్ద సమస్య అయిందని తెలుస్తుంది..