తెలుగు సిని ప్రేక్షకులలో ఈ పేరు తెలియని వారు ఉండరని అనడంలో ఎటువంటి అతిసయోక్తి లేదట..ఎందుకంటే ఈమె తరచు హాట్ ఫోటోలు మరియు వీడియోలతో పాటు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటుందట..ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయని సమాచారం..
అయితే ఇదే విషయంలో తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయని సమాచారం..సినిమా టికెట్ రేట్లు పెంచిన కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని చెప్పుకొచ్చాడట.
టికెట్ రేటు తగ్గించి ప్రేక్షకుల్నీ అవమానిస్తున్నారని అంటూ నాని ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు దుమారం రేపుతున్నాయని తెలుస్తుంది.తాజాగా ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసిందని తెలుస్తుంది..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రస్తుతం కొన్ని రకాల చానల్స్ లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది.
ఆ న్యూస్ చూసినప్పుడు నాకు కూడా కడుపు మంటగా అనిపించిందని అలాంటి వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు హీరో నాని అని తెలుస్తుంది. హీరో నాని గారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని అయితే అతను చేసిన వ్యాఖ్యలు కక్షతో చేశాడా లేక ఎవరైనా రాసిన స్క్రిప్టు చదివాడా లేకపోతే నిజంగా బాధ ఉండి అలా అన్నాడో తెలియడం లేదని
ఒకవేళ నాని సినిమా థియేటర్స్ విషయంలో అంతలా బాధపడుతూ ఉంటే అంతకు ముందు ఒకసారి సినిమా థియేటర్ వారి గురించి నేను ఎందుకు చూడాలి నా మీద పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ బాగుంటే చాలు అని నా సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తాం అని థియేటర్ యజమానులను కించపరుస్తూ అతని సినిమాలు ఓటీటీలో విడుదల చేశారని చెప్పుకొచ్చిందట శ్రీ రెడ్డి
ఒకప్పుడు అలా మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం మాత్రం కపట ప్రేమ నటిస్తూ థియేటర్ యజమానుల పై ప్రేమ కురిపిస్తున్నాడని తాను చేసిన వ్యాఖ్యలు మరిచిపోయి మాట్లాడుతున్నారా లేక పోతే ప్రజలను పిచ్చివారిని చేస్తున్నారా నాకు అర్థం కావడం లేదు అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చిందట.ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ లేక చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టు అర్థం కావడం లేదని చెప్పిందట.