ప్రపంచంలో ఎక్కడ విన్నా కూడా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే పుష్ప మూవీ సక్సెస్.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూడో సినిమా. మాస్ ప్రేక్షకులకు నాడిని తెలుసుకున్న సుక్కు అల్లు అర్జున్ ను ఊరమాస్ లుక్ లో చూపించారు. అతనితో సమానంగా రష్మిక కూడా నటించింది.. అందరూ అనుకున్న దానికన్న ఎక్కువ కష్టపడిందట. అందుకే ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చెస్తుంది.ఈ సినిమా హిట్ తో రష్మిక ఫుల్ అయిపోవడం ఖాయం అని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు..


ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అయిన విషయం తెలిసిందే.. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్న వాళ్ళకు గూస్ బంప్స్ రావడం పక్కా.. పాటలు అన్నీ కూడా యువతను ఉర్రూతలూరించాయి.. ముఖ్యంగా సమంత నటించిన ఐటమ్ సాంగ్.. ఈ సాంగ్ విడుదలైన మొదటి రోజు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల లోని పురుషుల సంఘాలు పాటను బ్యాన్ చేయాలనీ కేసులు కూడా పెట్టారు. కానీ ఎక్కడ చిత్రయూనిట్ వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు.


సినీ కెరియర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ సామ్ ఇలాంటి సాంగ్స్ చేయలేదు. పాటలో సామ్ బాగా కనిపించింది అంటూ యువత పొగిడేస్తున్నారు. చిత్ర పరిశ్రమ కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ విషయం పై స్టార్ హీరోలు సైతం విష్ చేశారు. ఈ నేపథ్యంలో విమర్శల బ్యూటీ శ్రీరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ మగాళ్ల కు సవాల్ విసురుతున్న ఈ అమ్మడు ఇప్పుడు సమంత పై ఇలా అనడం అందరూ షాక్ అవుతుంది.ఈ విషయం పై వీడియో లో చెప్తాను అని అంది. అది కాస్త వైరల్ అవుతుంది. పుష్ప 2 మరో రెండు నెల ల్లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: