నాచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ల కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. యువ భామలు కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నాని డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో మురళి శర్మ, రాహుల్ రవీంద్రన్, ,మడోన్నా సెబాస్టియన్, అభినవ్ గోమఠం తదితరులు నటించారు.
ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన శ్యామ్ సింగ రాయ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరో నాని వాసు గా, శ్యామ్ సింగ రాయ్ గా రెండు పాత్రల్లో తన అద్భుత నటనతో ఆడియన్స్ మనసు దోచుకోగా అటు కృతి, ఇటు సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో బాగా నటించారు. అయితే సెకండ్ హాఫ్ లో తన పాత్రతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ప్రణవలయ పాటలో అద్భుతంగా నర్తించిన సాయి పల్లవి పై మరింతగా పొగడ్తలు కురిపిస్తున్నారు ఆడియన్స్.
యాక్షన్ తో పాటు హృదయానికి హత్తుకునే ఎమోషన్ అంశాల మేళవింపుగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు రాహుల్ ఈ సినిమాని ఎంతో బాగా తీసారని పలువురు మూవీ పై ప్రశంసలు కురిపిస్తుండగా కొద్దిసేపటి క్రితం తమ సినిమాకి ఇంత మంచి ఆదరణ అందిస్తున్న ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా శ్యామ్ సింగ రాయ్ యూనిట్ కృతజ్ఞతలు తెల్పుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. తన కెరీర్ లోని గుర్తుండిపోయే పాత్రల్లో శ్యామ్ పాత్ర ఒకటని, ఇంతటి మంచి పాత్ర రాసిన రాహుల్ కి అలానే తనతో పని చేసి ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అయిన యూనిట్ సభ్యులు అందరికీ, ముఖ్యంగా సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు నాని.  



మరింత సమాచారం తెలుసుకోండి: