ఓ విధంగా చెప్పాలంటే నవీన్ పొలిశెట్టి హోస్టింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. యాంకర్ రష్మి కేవలం ఆ స్పాన్సర్స్ గురించి చెప్పడం వరకే పరిమితం కాగా షో మొత్తం సింగిల్ హ్యాండ్ తో నడిపించాడు నవీన్ పొలిశెట్టి. యువి నిర్మాతలతో కామెడీ.. ప్రభాస్ డైరక్టర్లకు సెటైర్ లతో కామెడీ కామెడీతో తన హోస్టింగ్ టాలెంట్ చూపించాడు నవీన్ పొలిశెట్టి. ఈ షో హోస్ట్ చేసినందుకు నవీన్ ఎంత ఛార్జ్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
అయితే నవీన్ అడిగినంత ఇచ్చే అవకాశం ఉన్నా ఇది జస్ట్ ప్రభాస్ మీద ప్రేమతోనే నవీన్ రాధేశ్యామ్ ఈవెంట్ కి హోస్ట్ గా చేశాడని తెలుస్తుంది. జాతిరత్నాలు టైం లో ప్రభాస్ చేసిన హెల్ప్ కి రిటర్న్ గిఫ్ట్ గా నవీన్ కూడా రాధేశ్యామ్ ఈవెంట్ లో తన యాంకరింగ్ తో అలరించాడు. ఓవిధంగా చెప్పాలంటే నవీన్ చేసిన హోస్టింగ్ కి ప్రొఫెషనల్స్ అయితే బాగానే డిమాండ్ చేస్తారని చెప్పొచ్చు. మొత్తానికి ప్రభాస్ డార్లింగ్ సినిమా ఈవెంట్ లో నవీన్ సందడి ప్రభాస్ ఫ్యాన్స్ కు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. హీరోగా వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్న నవీన్ పొలిశెట్టి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడని తెలుస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు రెండు హిట్లతో తర్వాత చేయబోయే సినిమా హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి.