సంక్రాంతి బరిలోకి పెద్ద పెద్ద హీరోలు పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి ఏకంగా 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అంటే సంక్రాంతికి నాలుగు రోజుల ముందున జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో భారీ సినిమా భీమ్లా నాయక్ సినిమాను  కూడా సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు. ఇక మరొక సినిమా రాధే శ్యామ్ ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపించేలా తెరకెక్కిస్తున్నారు.. కాబట్టి తప్పకుండా సంక్రాంతి బరిలోకి దించాలని నిర్మాతలు మాట్లాడుకొని ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. సుమారుగా కొన్ని కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలను పోటీకి దించి మిగతా అన్ని సినిమాలను పోటీ నుంచి తప్పించడం జరిగింది . అయితే ఇప్పుడు ఏకంగా ఈ రెండు సినిమాలతో పోటీ పడడానికి మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో బాక్సింగ్ ప్లేయర్ గా మనకు వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో సంక్రాంతి తరువాత అనగా మార్చి 18వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నాము అని అధికారికంగా పోస్టర్ తో ప్రకటించడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమాల ద్వారా  ఒకవైపు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ మరొకవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తమ సినిమాల కోసం  కూడా అందరూ ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానే బరి నుంచి తప్పించడంతో.. మరి ఈ సినిమాతో మెగా హీరో  ఎలా నెట్టుకొస్తాడో చూడాలని అందరూ కూడా  ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: