అయితే రాబోయే జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న తమ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కొద్దిరోజుల నుండి ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటోంది యూనిట్. ముఖ్యంగా పలు భాషల మీడియా వారికి ఎన్టీఆర్, చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి కూడా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. అందులో భాగంగా నేడు ప్రముఖ మీడియా సంస్థ ఫిలిం కంపానియన్ వారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదటి నుండి అటు మెగా, ఇటు నందమూరి ఫ్యామిలీ ల మధ్య శత్రుత్వం ఉన్న మాట నిజమేనని అన్నారు.
అయితే అది కేవలం వృత్తి పరంగా మాత్రమే అని, ఇక పర్సనల్ గా అటు చిరంజీవి, బాలకృష్ణ మొదలుకొని నేడు నేను, చరణ్ ఇద్దరం కూడా ఎంతో మంచి మిత్రులం అని అన్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ ఆర్ మూవీ వలన తామిద్దరి స్నేహం మరింత బలపడిందని, తప్పకుండా ఈ సినిమా స్పూర్తితో రాబోయే రోజుల్లో ఇతర స్టార్ హీరోల కలయికలో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక తామందరం దాదాపుగా మూడున్నరేళ్ల నుండి పడ్డ కష్టం అంతా ఇంతా కాదని, తప్పకుండా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆర్ఆర్ఆర్ మూవీ మంచి సక్సెస్ అందుకుని మా అందరిలో ఆనందాన్ని నింపుతుందనే నమ్మకాన్ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి వ్యక్తం చేసారు.