సినిమా హిట్టు పడితే ఆ కాంబో మరో సినిమా చేస్తుంతే ఆ ప్రాజెక్ట్ పై ఎన్నో భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక కాంబో రిపీట్ అవబోతుందని ఆడియెన్స్ ఖుషిగా ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు డైరక్టర్ అజయ్ భూపతి, హీరో కార్తికేయ. వీరిద్దరు కలిసి చేసిన ఆరెక్స్ 100 బాక్సాఫీస్ దగ్గర మంచి షేర్ రాబట్టింది. సినిమా అయిన బడ్జెట్ కు చేసిన వసూళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక మొదటి సినిమా ఇచ్చిన కిక్ తో హీరోగా కార్తికేయ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నాడు. డైరక్టర్ గా అజయ్ భూపతి తన సెకండ్ సినిమా మహా సముద్రం అని తీశాడు కాని వర్క్ అవుట్ కాలేదు.

ఇక ఇదిలాఉంటే అజయ్ భూపతి తన థర్డ్ మూవీ మళ్లీ కార్తికేయతో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే అజయ్ భూపతి ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పూర్తి చేశాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. కార్తికేయని స్టార్ చేసే కథతో.. ఓ సినిమా ఫ్లాప్ కొట్టిన కసితో థర్డ్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ చేశాడట అజయ్ భూపతి. ఎలాగు హిట్ కాంబినేషన్ కాబట్టి ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.

అజయ్ భూపతి ఈ సినిమా కథను కూడా చాలా కొత్తగా రాసుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ హిట్ కాంబో కాబట్టి ఆరెక్స్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని రిపీట్ చేస్తే మాత్రం సినిమాకు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ ఆరెక్స్ జోడీకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మరోసారి ఈ ఇద్దరితో సినిమా చేస్తే మాత్రం సినిమాలో ఏమాత్రం కొద్ది మ్యాటర్ ఉన్నా సూపర్ హిట్ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. మరి అజయ్ భూపతి కార్తికేయతో సినిమా ఎలా ఉండబోతుంది. ఆ సినిమా జానరో ఏది లాంటి విషయాలకు త్వరలోనే ఆన్సర్ దొరుకుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: