మరోవైపు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ అందుకోవడంతో పాటు యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్ ని సొంతం చేసుకున్నాయి. ఇక అవి మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో సినిమాపై ఎంతో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక ఈ ఆర్ఆర్ఆర్ సినిమాని వచ్చే నెల 7న ఎంతో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతూ ఉండడంతో పాటు లేటెస్ట్ గా ఒమిక్రాన్ భయం కూడా అందరినీ వెంటాడుతూ ఉండడంతో అక్కడక్కడా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.
అలానే కొన్ని రాష్ట్రాలు థియేటర్స్ ఆక్యుపెన్సీ 50 శాతానికి కుదించగా త్వరలో మరికొన్ని రాష్ట్రాలు అదే బాట పట్టనున్నాయి అనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతున్న పలు సినిమాల మూవీ యూనిట్స్ గుండెలో ఒకింత ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నట్లు చెప్తున్నారు. దీనితో జనవరి 7న రానున్న ఆర్ఆర్ఆర్ పక్కాగా మరికొద్దిరోజుల పాటు వాయిదా పడే ఛాన్స్ గట్టిగా ఉందని ఒక వార్త నిన్నటి నుండి వైరల్ అవుతోంది. దానితో అప్రమత్తమైన ఆర్ఆర్ఆర్ టీమ్, అవి అన్నీ కూడా ఒట్టి పుకార్లు మాత్రమే అని, తాము ఇప్పటికే తమ సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని, ఆ సమయానికి పరిస్థితులు అనుకూలిస్తాయనే నమ్మకం తమకు ఉందని తమ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు గట్టిగా వారు చెప్పినట్లు సమాచారం. దీనితో ఆర్ఆర్ఆర్ వాయిదా వార్తల్లో నిజం లేదని, అనుకున్న సమయానికే మూవీ థియేటర్స్ లో ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.