చాలా కాలం ఒంటరిగా గడిపిన హీరోయిన్లు ఈ ఏడాది లో పెళ్లి పీటలు ఎక్కారు. మరి కొంతమంది రిలేషన్ షిప్ తప్పు అని భావించి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలెబ్రిటీలు ఆ జాబితాలోకి వస్తారు. ఈ ఏడాది పెళ్ళి చేసుకున్న సినీ తారల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..

సింగర్ సునీత..
సింగర్ సునీత కొన్ని కారణాల వల్ల మరో పెళ్ళి చేసుకు న్న సంగతి తెలిసిందే.. మొదటి వ్యక్తి వదిలేసినందుకు ఎ మాత్రం భయపడకుండా ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది.  ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.. మొత్తానికి ఈ వయస్సులో పెళ్ళి చేసుకోవడం నిజంగా గ్రెర్
హీరోయిన్ ప్రణీత..
హీరోయిన్ ప్రణీత పేరు అందరికి తెలుసు.. ఎన్నో హిట్ సినిమాల లో నటించింది.స్టార్ హీరోలు సైతం ఈమె డేట్స్‌ కోసం వెయిట్ చేశారు. అయితే తర్వాత అమ్మడు సినిమాలను చేయడం తగ్గించి , యాడ్ లలో ఎక్కువ గా కనిపించింది. తన స్నేహితుడు ను ప్రేమించింది. కొంతకాలం ఇద్దరూ కలిసి ఉన్నారు    వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది..
యామీ గౌతమి..
ఎన్నో యాడ్ లలో కనిపించి యువతను బాగా ఆకర్షించిన బ్యూటీ యామీ గౌతమి.. ఏడాది జూన్‌4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్‌ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్ళి చేసుకుంది..
కార్తీకేయ..
ఈయన పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..మొదటి సినిమా తోనే మంచి హిట్ టాక్ ను అందుకున్న ఈ హీరో  ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్‌ 21న  హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
కత్రినా కైఫ్..
మళ్ళీశ్వరి సినిమా తో తెలుగుకు పరిచయమై న హీరోయిన్ కత్రినా కైఫ్..వీక్కీ కౌశల్‌ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్‌ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి ఒకటి అయిపోయారు. వారి వివాహానికి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.. ఇప్పుడు ఇద్దరు హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

 
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది రానా, నిఖిల్, నితిన్ వంటి స్టార్స్ కూడా పెళ్ళి చేసుకున్నారు.. ఇంకా పెళ్ళి చేసుకొని ప్రముఖులు చాలా మంది పెళ్ళి చేసుకోకుండా వున్నారు. వీరంతా పెళ్ళి ఇష్టం లేని వాళ్ళు అని చెప్పాలీ.. ఇదండీ ఈ ఏడాది తో పెళ్ళి తో ఒకటైన జంటలు..

మరింత సమాచారం తెలుసుకోండి: